ETV Bharat / crime

Viral Video : రాంగ్​ రూట్​లో వెళ్తే ఇంతే.. జర ఆలోచించండి..!

Wrong route accident: ఆఫీస్​కు సమయానికి వెళ్లాలనే తొందర. లేట్​ అయితే బాస్​ తిడతారనే భయం. ఈ క్రమంలో అతివేగంతో రోడ్డు ప్రయాణం. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్​ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే ఆందోళన.. అందుకే తప్పని తెలిసినా రాంగ్​ రూట్​లో ప్రయాణం చేస్తాం. మరికొందరేమో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతారు. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు.

Wrong route accident
Wrong route accident
author img

By

Published : Dec 26, 2021, 7:46 AM IST

ప్రాణాల మీదకు తెస్తున్న రాంగ్​ రూట్​ డ్రైవింగ్​..

Wrong route accident: వాహనం నడిపే సమయంలో రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ద్వారా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ నెల 22న మేడ్చల్​ జిల్లా కూకట్‌పల్లిలోని హైదర్​నగర్‌ యూ టర్నింగ్ వద్ద ఓ ఆటో డ్రైవర్ రాంగ్ రూట్​లో వెళ్తుండగా.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

అదృష్టవశాత్తు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇద్దరు ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా ఆటో డ్రైవర్ అక్కడి నుంచి రాంగ్ రూట్​లో పారిపోయాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వీడియో షేర్ చేశారు.

ఇదీ చదవండి : Etela Rajender on KCR: 'ఈ రెండేళ్లే.. ఆ తర్వాత తెరాస అధికారంలో ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.