మేడ్చల్ జిల్లా (women suicide in medchal) గాంధీనగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది (women suicide with harassments). మెదక్ జిల్లా, శివ్వంపేట మండలం గుండ్లపల్లెకి చెందిన నిఖిత(25)కు... చింతల్ గాంధీనగర్‌లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి మహేందర్‌కు గతేడాది జూన్ 14న వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.5లక్షలు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొంత కాలం నుంచి భర్తతో గొడవలు మొదలయ్యాయి. క్రమంగా అత్తింటి వేధింపులు పెరిగాయి. అత్త సువర్ణ, మామ సురేందర్, బావలు రవీందర్, రాజేందర్... ఇంట్లో అన్ని పనులు ఆమెతోనే చేయించేవారు. ఈ విషయాన్ని పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది నిఖిత.. వారు వచ్చి నచ్చజెప్పినా కుమార్తె అత్తింటి వారిలో ఎలాంటి మార్పు రాలేదు.
అంతలోనే ఏమైంది..
ఈ నెల 20న నిఖిత తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి.. తనను తీసుకెళ్లాల్సిందిగా కోరింది. ఆమెను తీసుకెళ్లేందుకు బయలుదేరిన ఆమె సోదరుడు.. మంగళవారం ఉదయం 8 గంటలకు ఫోన్ చేశాడు. ఇంటివద్దనే ఉన్నాను వచ్చి తీసుకుపొమ్మని కోరింది. ఉదయం 10 గంటలకు అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో అందరూ ఏడుస్తూ కనిపించారు. ఏమైందని అడిగితే నిఖిత ఆత్మహత్యాయత్నం చేసిందని.. బాలానగర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది(women suicide in medchal).
వాళ్లే చంపేశారు..
తమ బిడ్డను మానసికంగా, శారీరకంగా హింసించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అత్తింటి వేధింపులతోనే తమ బిడ్డ మృతి చెందిందని.. వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Dowry Death: భర్తతో సహా వరకట్న వేధింపులు.. వివాహిత బలవన్మరణం..!