పోలీసులు తనపై అకారణంగా లాఠీ ఛార్జ్ చేశారంటూ.. ఓ మహిళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ఈనెల 12న వరంగల్ జిల్లా లక్ష్మీపురంలో పర్యటించారు. స్థానికురాలు దేవి.. మంత్రిని కలిసి సమస్యలను విన్నవించుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు తనను అడ్డుకోవడమే కాక.. అన్యాయంగా తనపై దాడి చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గ్రామాన్ని సందర్శించిన మంత్రి.. తమ ఇంటికి వచ్చి టీ తాగి, తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని బాధిత మహిళ గుర్తు చేశారు. ఆ విషయమై కేటీఆర్‌ను కలవాలని ప్రయత్నించినట్లు వివరించారు. తన వద్దనున్న పేపర్లు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రులను లాక్కొని, తనపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని వాపోయారు. బీసి సంఘం నేత దాసు సురేశ్.. ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండి: నాగార్జునసాగర్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం