హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఎయిర్పోర్ట్ పీఎస్లో కేసు నమోదైంది. అడ్మిన్ శ్రీకాంత్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత మహిళలు ఆరోపించారు. రూముకు రాకపోతే మీ ఉద్యోగాలు ఉండవంటూ బెదిరించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలోని ఎజైల్ సర్వీసెస్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై అడ్మిన్ శ్రీకాంత్ ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. మీ ఉద్యోగం ఉండాలంటే శారీరకంగా తనతో గడపాలని బెదిరించేవాడని బాధితులు వాపోయారు. లైంగిక వేధింపులు తాళలేక ఎనిమిది మంది మహిళా సిబ్బంది ఎయిర్పోర్ట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అతనితో తమకు ప్రాణ హాని ఉందని.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరారు.