ETV Bharat / state

గ్రూప్-4 విజేతలకు గుడ్​న్యూస్ - నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్

గ్రూప్-4 విజేతలకు నేడు అందనున్న నియామక పత్రాలు - పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

Group-4 Appointment Letters
CM Revanth Announces Appointment Letters for Group-4 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

CM Revanth Reddy Gives Appointment Letters for Group-4 Winners : గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందనున్నాయి. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి నేడు పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వైద్యారోగ్య శాఖ ఎంపిక చేసిన 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న 593 మంది కూడా పత్రాలు అందుకోనున్నారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు : ఏడాది కాలంలో 54 వేల 520 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. టీజీపీఎస్సీ ద్వారా 12 వేల 324 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. వైద్యారోగ్య నియామక బోర్డు 7 వేల 378, పోలీసు నియామక సంస్థ 16 వేల 67, గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 8 వేల 304 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపింది. డీఎస్సీ ద్వారా 10 వేల 6 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించినట్లు వివరించింది. మరో 441 ఉద్యోగాలు ఇతర సంస్థల ద్వారా నియమించినట్లు వెల్లడించింది. గ్రూప్-4తో పాటు, సింగరేణి, వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన 9 వేల మందికి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. సాయంత్రం పెద్దపల్లిలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలను అందుకోనున్నారు.

న్యూయార్క్‌, టోక్యో తరహాలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి : సీఎం రేవంత్‌రెడ్డి

వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ 2022 డిసెంబరు 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జులై 1న రాత పరీక్ష నిర్వహించి మూడు విడతల్లో ధ్రువపత్రాల పరిశీలన జరిపిన టీజీపీఎస్సీ 8 వేల 143 మందిని ఎంపిక చేసింది. పురపాలక, ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ సంక్షేమ, పౌరసరఫరాలు, అటవీ, జీఏడీ, వైద్యారోగ్య, విద్య, హోం, పరిశ్రమలు, కార్మిక, పంచాయతీ రాజ్, ప్రణాళిక, రెవెన్యూ , రవాణ, టూరిజం శాఖలు, యూనివర్సిటీలు, హెచ్ఎండీఏలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు.

వారికి కుడా పత్రాలు : సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ ఏడాదిలో 2 వేల 165 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సింగరేణి సంస్థ వెల్లడించింది. వైద్యారోగ్య బోర్డు నియామక ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కూడా ముఖ్యమంత్రి ఉద్యోగ పత్రాలు అందజేయనున్నారు.

'చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పనిచేస్తోంది - త్వరలోనే గ్రూప్​1 నియామక పత్రాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.