ETV Bharat / crime

ఆ యువతులు విరాళాలు సేకరిస్తారు.. ఇవ్వకపోతే దూషిస్తారు

ఏపీలోని గుంటూరు తరహాలో మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ పరిధిలో... ప్రకృతి విపత్తు బాధితుల పేరిట యువతులు విరాళాలు సేకరిస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిని దుషించినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని... విచారణ జరిపి బైండోవర్ కేసు నమోదు చేశారు.

women-collects-money-in-the-name-of-natural-disasters-at-ghatkesar
ఆ యువతులు విరాళాలు సేకరిస్తారు.. ఇవ్వకపోతే దూషిస్తారు
author img

By

Published : Mar 1, 2021, 3:52 PM IST

Updated : Mar 1, 2021, 6:11 PM IST

ప్రకృతి విపత్తు బాధితుల పేరిట విరాళాలు వసూలు చేస్తున్న మహిళలను ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పరిధిలోని కరీంగూడ రోడ్డులో కొందరు మహిళలు వాహనదారులను విరాళాలు అడుగుతున్నారు. వారి మాటలు నమ్మి కొందరు విరాళాలు ఇస్తున్నారు.

డబ్బులు ఇవ్వని వారిని యువతులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. విరాళాలు సేకరించే సంస్థ పేరుగాని ఎవరికి వాటిని అందిస్తున్నారనే వివరాలు చెప్పకపోవటంతో వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వీరంతా గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన వారిగా గుర్తించి... బైండోవర్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఆ యువతులు విరాళాలు సేకరిస్తారు.. ఇవ్వకపోతే దూషిస్తారు

ఇదీ చూడండి: కాలేజ్ అమ్మాయిల్లా కనిపిస్తారు.. విరాళాల పేరుతో దండుకుంటారు!

Last Updated : Mar 1, 2021, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.