ETV Bharat / crime

SUICIDE: భర్త పండుగకు రానన్నాడని... భార్య ఆత్మహత్య

wife suicide
క్షణికావేశంలో ఆత్మహత్య
author img

By

Published : Oct 15, 2021, 8:56 AM IST

Updated : Oct 15, 2021, 1:10 PM IST

08:22 October 15

క్షణికావేశంలో ఆత్మహత్య

భర్త పండగకు రానన్నాడని మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణాని (SUICIDE)కి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్‌ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అనిల్‌ డీసీఎం డ్రైవర్‌. దసరా పండగకు ఊరికి రావాలని భార్య మౌనిక భర్తకు ఫోన్‌ చేసింది. పని ఉందని వెంటనే రావడానికి వీలు కాదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది.

పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య (SUICIDE)కు పాల్పడింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మేశ్‌ తెలిపారు. పండుగ పూట జరిగిన విషాదంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయాయి. 

ఇదీ చూడండి: BUS ACCIDENT: ఆర్టీసీ బస్సు బోల్తా, 20 మందికి గాయాలు

Gang Rape at Rajendranagar : ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత?

Last Updated : Oct 15, 2021, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.