ETV Bharat / crime

ప్రేమ వ్యవహారంతో... యువకున్ని చితకబాదిన యువతి బంధువులు - telangana news

ప్రేమ వ్యవహారంలో యువకున్ని యువతి తల్లిదండ్రులు చితకబాదిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యానిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఆగకుండా దాడి చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాని ఎస్‌ఐ రామారావు తెలిపారు.

యువకున్ని చితకబాదిన యువతి బంధువులు
యువకున్ని చితకబాదిన యువతి బంధువులు
author img

By

Published : Jun 22, 2021, 7:17 PM IST

ప్రేమపెళ్లి చేసుకున్న యువకున్ని యువతి బంధువులు చితకబాదిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాని కేంద్రంలో జరిగింది. మూడేళ్లుగా ఇరకపల్లి గ్రామానికి చెందిన మడావి సమతను షేర్ల రాము ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో గతేడాది జులైలో హైదరాబాద్‌లో పెళ్లిచేసుకుని రహస్యంగా కాపురం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌తో తిర్యానికి రావడంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు రాముని చితకబాదారు. గ్రామస్థులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఆగకుండా దాడి చేశారు. రాము భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాని ఎస్‌ఐ రామారావు తెలిపారు.

మూడేళ్ల నుంచి మడావి సమత నేను ప్రేమించుకుంటున్నాము. తన తల్లిదండ్రులు మా ప్రేమని తిరస్కరించడంతో హైదరాబాద్‌ వెళ్లి గతేడాది జులై 13న పెళ్లి చేసుకున్నాము. లాక్‌డౌన్‌తో తిర్యానికి రావడంతో ఆగ్రహించిన సమత కుటుంబ సభ్యులు చౌరస్తా వద్ద రాళ్లతో నాపై దాడి చేశారు. వారి నుంచి నాకు ప్రమాదం ఉండడంతో పోలీసులు తగిన చర్యతీసుకోవాలని కోరుతున్నాను -బాధిత యువకుడు

ప్రేమ వ్యవహారంతో... యువకున్ని చితకబాదిన యువతి బంధువులు

ఇదీ చదవండి: పండంటి కాపురంలో మద్యం చిచ్చు.. భార్యను చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.