ETV Bharat / crime

పరాయి మహిళలపై వ్యామోహం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య - జియాగూడలో భర్తపై వేడి నూనె పోసిన భార్య

woman poured boiling oil on husband at jiyaguda : పరాయి ఆడవాళ్ల వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కోపోద్రిక్తురాలైన ఓ భార్య అతడిపై వేడివేడి నూనె పోసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

woman poured boiling oil on husband at jiyaguda

author img

By

Published : Sep 7, 2022, 10:28 AM IST

woman poured boiling oil on husband at jiyaguda :భర్త పరాయి స్త్రీల వ్యామోహంలో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని విసిగిపోయిన భార్య క్షణికావేశంలో అతనిపై వేడి నూనె పోయడంతో తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కుల్సుంపురా ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఎస్సై శేఖర్‌ కథనం ప్రకారం..విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన గిరిధర్‌లాల్‌(50), రేణుక(40) దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.

విజయవాడలో మాంసం వ్యాపారం నిర్వహించే గిరిధర్‌లాల్‌ పిల్లల చదువుల నిమిత్తం మూడున్నరేళ్ల క్రితం నగరానికి వచ్చి జియాగూడ కబేళాలో పని చేస్తూ దరియాబాగ్‌లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా గిరిధర్‌లాల్‌ పరాయి స్త్రీల వ్యామోహంలో పడి భార్యాపిల్లల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడని భార్య ఆరోపిస్తున్నారు. ఐదు నెలలుగా ఓ మహిళ వద్దే ఉంటూ, మూడు రోజుల కిందటే తన వద్దకు వచ్చాడని చెబుతున్నారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి.

మంగళవారం ఉదయం వారిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రేణుక క్షణికావేశంలో వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను భర్త తలపై పోసింది. గిరిధర్‌లాల్‌ తల, ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. రేణుకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్తపై గతంలో విజయవాడలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.