కాలకృత్యాల కోసం వెళ్లి ఓ మహిళ అదృశ్యమయింది. తన భార్య ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల ఆందోళనకు గురైన భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.
ఛత్తీస్‌గడ్‌కు చెందిన దిలీప్‌కుమార్ జంగ్డే తన కుటుంబంతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోని సాయిరాం కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా మేస్తీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈనెల 11న రాత్రి తన భార్య ఊర్మిళ జంగ్డే కాలకృత్యాలకు బయటకు వెళ్లినట్లు తెలిపాడు. ఎంతకీ తిరిగి రాకపోవడం వల్ల చుట్టుపక్కల వెతికినట్లు చెప్పాడు. ఆచూకీ దొరకకపోవడం వల్ల అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు దిలీప్ తెలిపాడు.
ఇవీచూడండి: మత్తు కేసులో మరికొందరు తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు?