మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అసలేం జరిగిందంటే...
జగద్గిరిగుట్ట పరిధి నెహ్రూనగర్‌లో రజనీ(30), రాజు దంపతులు నివాసముంటున్నారు. ఆమె టైలర్‌గా పనిచేస్తుండగా.. రాజు ప్రైవేటు ఉద్యోగి. సోమవారం సాయంత్రం రజనీ ఇంట్లో ఉరేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని గాంధీకి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి వేధింపులతోనే రజనీ ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త రాజు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చూడండి : మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానానే: జీహెచ్ఎంసీ