జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో దారుణం చోటుచేసుకుంది. భర్త రాజాగంగారంను భార్య భాగ్యలక్ష్మి హత్య చేసింది. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగొచ్చి భార్యపై భర్త రాజాగంగారం దాడిచేశాడు. తన ఆత్మరక్షణ కోసం భర్తను కత్తెరతో పొడిచి చంపినట్లు భాగ్యలక్ష్మి పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు.
భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య - Atrocities in Vemulakurthi
![భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10672407-878-10672407-1613622119922.jpg?imwidth=3840)
భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య
09:19 February 18
భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య
09:19 February 18
భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో దారుణం చోటుచేసుకుంది. భర్త రాజాగంగారంను భార్య భాగ్యలక్ష్మి హత్య చేసింది. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగొచ్చి భార్యపై భర్త రాజాగంగారం దాడిచేశాడు. తన ఆత్మరక్షణ కోసం భర్తను కత్తెరతో పొడిచి చంపినట్లు భాగ్యలక్ష్మి పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 18, 2021, 11:33 AM IST