ETV Bharat / crime

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్.. చివరకు - ప్రియుడి స్నేహితులతో భర్తని చంపించిన భార్య

Wife Killed Her Husband: శంకర్‌గౌడ్‌, రజిత ఇరువురు దంపతులు ఆర్టీసీ కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నంతలో హాయిగానే జీవిస్తున్నారు. ఇంతలో ఆమెకు ఓ అపరిచిత వ్యకితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరికి అడ్డుగా ఉన్నాడనే భర్తను హతమార్చడానికి ‌ప్రియుడి స్నేహితులతో కలిసి భార్య ప్రణాళిక వేసి అంతమొందించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Wife Killed Her Husband
Wife Killed Her Husband
author img

By

Published : Dec 30, 2022, 11:50 AM IST

Updated : Dec 30, 2022, 2:30 PM IST

Wife Killed Her Husband: వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను చంపాలని పథకం వేసింది. ప్రణాళిక ప్రకారం దాడి చేయించిది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త తర్వాత కోలుకున్నాడు. కానీ కొన్నాళ్లకు గుండెపోటుతో చనిపోయాడు. అతడిపై కుట్ర ప్రకారమే దాడి జరిగిందనే విషయం లోకానికి తెలియదు. 9నెలల తర్వాత భర్తపై భార్య చేయించిన దాడికి సంబంధించిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌కు చెందిన శంకర్‌గౌడ్‌, రజిత దంపతులు. ఆర్టీసీలో కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న రజితకు కానిస్టేబుల్‌ వరుణ్‌ రాజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఉందని శంకర్‌గౌడ్‌ బంధువులు తెలిపారు. తమ బంధానికి అడ్డు వస్తున్న భర్త శంకర్‌గౌడ్‌పై, ప్రియుడి స్నేహితులతో రజిత దాడి చేయించింది. ఈ దాడిలో శంకర్‌గౌడ్‌ గాయాలతో బయపడ్డాడు.

మద్యం మత్తులో జరిగిన ఘటనగా రజిత చిత్రీకరించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దాడి వెనుక ఉన్న కుట్రను రజిత స్నేహితురాలి సోదరుడు బయటపెట్టాడు. రజిత చేసిన కుట్రతో గాయపడిన శంకర్‌గౌడ్‌ ఆ తర్వాత మానసిక క్షోభతో గుండెపోటుకు గురై చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజిత, ఆమె ప్రియుడు వరుణ్‌ రాజ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.