ETV Bharat / crime

కట్టుకున్న భర్త చికిత్స చేస్తానంటే నమ్మింది...కానీ చివరకి..

author img

By

Published : Feb 8, 2022, 12:42 PM IST

husband cheating wife: జీవితాంతం తోడుగా నిలవాల్సిన భర్త కట్టుకున్న భార్యనే అంతమొందించేందుకు యత్నించాడు. ఓ సారి ఆమెకు ఆరోగ్య సమస్య రాగా తానే చికిత్స అందిస్తానని చెప్పాడు. భర్తను నమ్మిన ఆ మహిళ చికిత్సకు ఒప్పుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. మోసపోయానని తెలుసుకొని న్యాయం చేయాలని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు నిజామాబాద్ కలెక్టరేట్​కు వచ్చి ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

husband cheating wife
మోసం చేసిన భర్త

husband cheating wife: కలకాలం కలిసుంటాడనుకున్న భర్తే చివరకు ఆమె పాలిట శాపంగా మారాడు. తనను వదిలించుకునేందుకు...కట్టుకున్న భర్తనే స్టెరాయిడ్స్ ఇచ్చి చంపడానికి యత్నించాడని ఆర్మూర్​కి చెందిన ఓ మహిళ నిజామాబాద్ కలెక్టరేట్​కు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్​కు ఫిర్యాదు చేసింది.

అసలు ఏం జరిగిందంటే...

పెళ్లై బాబు పుట్టిన తర్వాత నుంచి వెళ్లిపొమ్మంటూ వేధించినా పుట్టింటి వారి పరిస్థితి బాగోలేక వెళ్లలేదని.. ఆ సమయంలో చర్మ సమస్య రాగా.. చికిత్స అంటూ తన భర్త స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేశాడని బాధిత మహిళ వాపోయింది. ఆరోగ్యం క్షీణిస్తోందని నిజామాబాద్​లో ఓ ఆస్పత్రికి వెళ్లగా వైద్యుడు పరిశీలించి స్టెరాయిడ్స్ ఇచ్చారని చెప్పారు. దాంతో భర్త చేసిన మోసం తెలుసుకొని ఆమె వాపోయింది. ఇంకొన్ని రోజులు తీసుకుని ఉంటే మరణించేదాన్ని అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై అడిగితే ఇబ్బందులు పెట్టాడని.. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా న్యాయం జరగలేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు తెలిపింది. అందుకే న్యాయం కోసం కలెక్టర్​కు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని చెప్పారు. బాధిత మహిళ స్రవంతికి గంగసాగర్​తో 2017 లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి 4 ఏళ్ల బాబు ఉన్నాడు. గంగసాగర్ ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్​గా పని చేస్తున్నాడు.

ఇదీ చదవండి:Man Suicide at pochampad : విషాదం.. స్నేహితుడి మృతి తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.