ETV Bharat / crime

Wife murdered husband: ఇద్దరు కుమార్తెల పెళ్లి చేసింది.. కానీ ఆ యువకుడి మోజులో పడి...

author img

By

Published : Oct 10, 2021, 12:43 PM IST

Updated : Oct 10, 2021, 2:04 PM IST

కుటుంబ పోషణ కోసం భర్త దుబాయ్​లో కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకునితో ఏర్పడిన పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు విషయం తెలియడంతో చివరకు హంతకురాలిగా(Wife murdered husband) మారింది.

wife murdered husband
భర్తను చంపిన భార్య

జీవింతాంతం తోడుగా నిలవాల్సిన భార్య... ఆ భర్త పాలిట మృత్యువుగా(Wife murdered husband) మారింది. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి మందలించినందుకు.. కట్టుకున్న వాడిని కడతేర్చింది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం(Wife murdered husband) చోటుచేసుకుంది.

మేళ్ల చెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన భూక్యా బాలాజీ(40) గత కొన్నేళ్లుగా దుబాయ్​లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లయ్యాయి. బాలాజీ ఇటీవలే స్వగ్రామానికి చేరుకున్నాడు. భార్య మరో యువకుడితో చనువుగా ఉంటుందని తెలిసి.. ఆమెను మందలించాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాలాజీని(Wife murdered husband) అతని భార్య హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

డబ్బు, ఆకర్షణలకు లోనై

వివాహేతర సంబంధాలే కాకుండా వేర్వేరు కారణాలతో సైతం మూడు ముళ్ల బంధాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు భార్యలు. డబ్బు, ఆకర్షణలకు లోనై జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తలను చంపేస్తున్నారు. తాజా ఘటనే కాకుండా గతంలోనూ ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి.

మహబూబ్​నగర్​ జిల్లాలోని ధర్పల్లిలో డబ్బు కోసం భర్తను హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టింది. హత్య జరిగిన 2నెలల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బుల విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవే.. ఈ దారుణానికి దారితీసింది. భర్తను హత్య చేసి శౌచాలయం కింద పాతిపెట్టిన అనంతరం ఏమీ తెలియనట్లుగా ప్రవర్తించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, దర్యాప్తుతో హత్యా ఉదంతం గత నెలలో వెలుగులోకి వచ్చింది.

భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవనం సాగించాల్సిన ఓ ఇల్లాలు.. వివాహేతర సంబంధానికి ఆకర్షితురాలైంది. ప్రియుడి మోజులో పడి తమ బంధానికి అడ్డు వస్తున్నాడని అతనితో కలిసి.. రెండు నెలల క్రితం భర్తను చంపి నల్లమల అడవుల్లో పారేసింది. చివరకు కటకటాలపాలైంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: GRMB MEETING: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ.. ఆ అంశంపైనే కీలకచర్చ!

Last Updated : Oct 10, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.