ETV Bharat / crime

భర్తను హత్య చేసి కనిపించడం లేదని ఫిర్యాదు - telangana news today

భార్యే భర్తను హతమార్చి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. పైగా ఏం ఎరగనట్టు భర్త అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా...అసలు విషయం బయటపడింది.

MURDER
MURDER
author img

By

Published : Mar 10, 2021, 4:00 PM IST

Updated : Mar 10, 2021, 7:04 PM IST

'భర్తను హత్య చేసి కనిపించడం లేదని ఫిర్యాదు'

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యే భర్తను చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టింది. ఫిబ్రవరి 8న గగన్ అగర్వాల్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఎల్బీ నగర్​లో అదృశ్యమయ్యాడని ఫిర్యాదు అందగా...కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యతోపాటు అతని బంధువులను విచారించారు. రెండో భార్య నౌషీన్ బేగం, గగన్ అగర్వాల్ స్నేహితుడి సహాయంతో భర్తను హత్యచేసి పూడ్చిపెట్టిందని గుర్తించారు.

ఏమీ ఎరగనట్టుగా..

గగన్ అగర్వాల్ రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 8న అగర్వాల్, అతని స్నేహితుడు సునీల్, భార్య నౌషీన్ బేగంతో కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత గొడవ జరగగా... సునీల్ సాయంతో భర్తను కత్తితో పొడిచి హతమార్చింది. అయితే... గగన్ సోదరుడు నిలదీయగా.. ఫిబ్రవరి 18న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్​లో ఏమీ ఎరగనట్టుగా ఫిర్యాదు చేసింది. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లింది. నౌషీన్‌ బేగంను అదుపులోకి తీసుకున్న విచారించగా... గగన్​ను హత్య చేసి ఇంటి వెనక పూడ్చిపెట్టనట్లు ఒప్పుకుందని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించటం వల్లే చంపినట్లు తెలిపిందని వెల్లడించారు.

అక్కడే పోస్టుమార్టం

నౌషీన్ బేగంను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. గగన్ అగర్వాల్ స్నేహితుడు పరారీలో ఉన్నాడు. స్థానిక తహసీల్దార్ సమక్షంలో క్లూస్ టీమ్​తో కలిసి ఘటనా స్థలం నుంచి పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదీ చూడండి : సన్నబడాలనే భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య

Last Updated : Mar 10, 2021, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.