ETV Bharat / crime

ప్రియుడిపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే..! - చిత్తూరు జిల్లా

Wife killed Husband: వివాహేతర సంబంధాల మోజులో పడి వివాహ బంధాలను విస్మరిస్తున్నారు. ఈ మైకంలో ఉన్నవాళ్లు అయినవాళ్లను సైతం కడతేరుస్తున్నారు. కొత్త మోజు, అడ్డుగా ఉన్నారనే భావనతో కట్టుకున్న వాళ్లను హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.

Wife killed Husband
Wife killed Husband
author img

By

Published : Sep 4, 2022, 8:26 PM IST

Wife killed Husband: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్​ కాలనీలో విజయ్, వనిత నివాసం ఉంటున్నారు. విజయ్ సెల్​షాపు నిర్వహిస్తున్నాడు. వారం క్రితం ఎప్పటిలాగే షాప్​కు వెళ్లిన విజయ్ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం విజయ్ సోదరుడు, మిత్రులు గాలించిన ఆచూకీ లభించలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండరాజు కుప్పం క్వారీ వద్ద విజయ్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతుని ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తు వేగం పెరగటంతో భయపడిన విజయ్ భార్య గుండరాజు కుప్పం వీఆర్వోకు హత్య వివరాలు వెల్లడించింది. వీఆర్వో.. విజయ్ భార్యను పోలీసులకు అప్పగించాడు. తానే ప్రియుడు తమిళ అరసన్నుతో హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది.

గతంలో వనిత.. ఆమె ప్రియుడు తమిళ అరసన్ను సన్నిహితంగా ఉండటం విజయ్ గమనించాడు. ఈ విషయంపై భార్యను మందలించాడు. దీంతో ప్రియుడిని కలవటం ఇబ్బందిగా మారిందని.. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోడానికి.. వనిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. విజయ్​ను క్వారీ వద్దకు పిలిపించిన తమిళ అరసన్ను.. విజయ్​ను రాళ్లతో కొట్టి అక్కడ ఉన్న నీళ్లలో పడేశాడు. ఈత రాని విజయ్ నీళ్లలో మునిగి చనిపోయాడని నిర్దారించకుని అక్కడినుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో ఆమె ప్రియుడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని.. రిమాండ్​కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. సహకరించిన ముగ్గురిలో మైనర్ ఉన్నట్లు పోలీసులు వివరించారు.

ప్రియుడిపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.