ETV Bharat / crime

భర్త ఇంటి ముందు 13 రోజులుగా ధర్నా - wife dharna for thirteen days

భర్త కోసం ఇంటి ముందే ఓ ఇల్లాలు నిరవధిక పోరాటానికి దిగింది. తన కాపురాన్ని నిలబెట్టుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చుంది. రాత్రి సమయాల్లో చలిలోనే నరకయాతన అనుభవిస్తూ అకుంఠిత దీక్షతో పోరాడుతోంది. అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్​నగర్ కాలనీ​లో భర్త ఇంటి ముందు 13 రోజులుగా పోరాడుతోంది.

wife dharna at husband house in kamareddy
భర్త ఇంటి ముందు 13 రోజులుగా ధర్నా
author img

By

Published : Feb 8, 2021, 10:26 PM IST

Updated : Feb 8, 2021, 10:41 PM IST

భర్త కోసం భార్య నిరవధిక ఆందోళనకు దిగింది. తన కాపురం కోసం భర్త ఇంటి ముందు 13 రోజులుగా పోరాటం చేస్తూ నరకయాతన అనుభవిస్తోంది. తన భర్త తనను ఇంట్లోకి రానిచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆ మహిళ భీష్మించు కూర్చుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోకనగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పదమూడు రోజులుగా తనను అధికారులు పట్టించుకోవడం లేదని పైడి అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి సమయాల్లో ఇంటి బయటే ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నానని వాపోయారు. తన భర్త పైడి నవీన్ కుమార్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆమె ఆరోపించింది. తన భర్త కోసం ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి పోరాడుతానని తెలిపింది. తన భర్త కుటుంబ సభ్యులు తాళాలు వేసుకుని దొడ్డిదారిన వెళ్లిపోతున్నారని.. ఇంట్లోకి రానివ్వకపోతే ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానని చెప్పారు.

భర్త ఇంటి ముందు 13 రోజులుగా ధర్నా

ఇదీ చూడండి : రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి

Last Updated : Feb 8, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.