ETV Bharat / crime

అందంగా లేవని భర్త వేధింపులు.. ఉరేసుకుని భార్య బలవన్మరణం - woman suicide in vikarabad

Wife Suicide by husband harassment : వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. రెండేళ్లు తిరగకుండానే.. అందంగా లేవంటూ.. అతడు వేధింపులు మొదలు పెట్టాడు. బంధువులు, పెద్దలు సమస్యను పరిష్కరించలేక పోవడంతో చేసేది లేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వికారాబాద్​ జిల్లా తాండూరు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది.

wife committed suicide
భార్య ఆత్మహత్య
author img

By

Published : Feb 19, 2022, 8:18 AM IST

Wife Suicide by husband harassments: ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలి అందం గురించి పట్టించుకోని యువకుడు.. భార్యగా మారాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. చీటికిమాటికీ అందంగా లేవంటూ వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ముదిరి దాడులకు తెగబడ్డాడు. రోజూ భర్త పెట్టే వేధింపులు తాళలేక.. ఆమె ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఎవరూ లేని సమయంలో.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్​ జిల్లా తాండూరు మండల పరిధిలోలో ఈ ఘటన జరిగింది.

పెద్దలకు చెప్పుకున్నా

తాండూరు మండలం జిన్‌గుర్తికి చెందిన మహేష్‌, యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23) ఇద్దరూ.. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వారి జీవితం అన్యోన్యంగానే కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అందంగా లేవని, భార్యను శారీరకంగా, మానసికంగా నిత్యం వేధించడమే కాకుండా, చేయిచేసుకోవడం ప్రారంభించాడు. తన ఆవేదనను పలుమార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో చెప్పుకొని ఆమె విలపించేది. ఇటీవల భర్త వేధింపులు అధికమయ్యాయి. తన సమస్యను ఎవరూ పరిష్కరించలేరు అని.. ఇక తనకు చావే శరణమని భావించి బలవన్మరణానికి పాల్పడింది.

ఎవరూ లేని సమయంలో

గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సునీత.. దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లిన భర్త తిరిగి వచ్చి చూసే సరికి అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించాడు. విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా, వీలు కాకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పాడు. భర్త వేధింపులు తాళలేకనే తన చెల్లి ఆత్మహత్య చేసుకుందని సోదరి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరణ్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: బ్యూటీషియన్​ ముసుగులో దందా.. ఫ్రిడ్జ్​లో దొరికిన సాక్ష్యం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.