ETV Bharat / crime

డబ్బులు కావాలంటూ వాట్సాప్... 1.5 లక్షలు స్వాహా - వాట్సప్ హ్యాక్

దగ్గర బంధువు వాట్సప్​ నుంచి డబ్బులు కావాలని మెసేజ్ రావడంతో... డబ్బులు పంపాడు ఓ వ్యక్తి. అనంతరం తన వాట్సప్​ హ్యాక్​ అయిందంటూ బంధువు ఫోన్ చేసి తెలపడంతో మోసపోయానని గుర్తించి... సైబర్​ క్రైంను ఆశ్రయించాడు.

whatsapp-hack-and-money-fraud-cybercrime-at-balanagar
డబ్బులు కావాలంటూ వాట్సాప్... 1.5 లక్షలు స్వాహా
author img

By

Published : May 21, 2021, 9:41 AM IST

నరసింహమూర్తి అనే వ్యక్తి బాలానగర్​ పీఎస్​ పరిధిలో నివాసముంటున్నాడు. తన బావమరిది నాగేంద్ర వాట్సప్​ నుంచి అర్జెంటుగా డబ్బులు పంపాలని... బ్యాంక్​ వివరాలతో సహా మెసేజ్ వచ్చింది. వెంటనే నరసింహ 1.5 లక్షల రూపాయలు పంపాడు. అనంతరం తన వాట్సప్​ హ్యాక్​ అయిందని డబ్బులు పంపించవద్దని నాగేంద్ర... నరసింహ మూర్తికి బంధువుల ఫోన్​ ద్వారా తెలిపాడు.

అప్పటికే నగదు బదిలీ చేసినట్లు నరసింహమూర్తి వెల్లడించాడు. దీంతో మోసపోయానని గ్రహించి బాలానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది హ్యాకర్ల పనేనా? లేదంటే మరెవరైనా మోసానికి పాల్పడ్డారనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రోజుల తరబడి నిరీక్షణ.. అన్నదాతల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.