నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వరంగల్ సీపీ తరుణ్ జోషి హెచ్చరించారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డీలర్లు సహకరించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలో కల్తీ విత్తనాల కట్టడికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాడులు నిర్వహించి ఇప్పటి వరకు రూ. కోటి 61 లక్షల విలువ గల నకిలీ విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందితే.. తక్షణమే 6301176533 నెంబర్కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
ఇదీ చదవండి: Fake Seeds: భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్