ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లిలో గ్రామ వాలంటీరు చేతివాటం ప్రదర్శించాడు. వృద్ధులకు ఇవ్వాల్సిన 50 వేల రూపాయల పింఛను సొమ్మును సొంత అవసరాలకు వాడుకున్నాడు. పులిగుండ్లపల్లి సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న కొండారెడ్డి పింఛన్ల పంపిణీ కోసం తన పరిధిలో ఉన్న 20 మంది వృద్ధుల వేలిముద్రలు తీసుకున్నాడు. ప్రభుత్వం నుంచి డబ్బులు ఇంకా రాలేదని వచ్చాక అందిస్తానని నమ్మబలికాడు.
వాలంటీర్ మాటలు నిజమేనని నమ్మిన వృద్ధులు వచ్చే నెలలో రెండు పింఛన్లు అందుకోవచ్చని అనుకున్నారు. ఓ వృద్ధుడు సచివాలయానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పగా.. వారు డబ్బులు ఎప్పుడో పంచేశామని సమాధానమిచ్చారు. ఈ విషయం పింఛనుదార్లకు తెలియడంతో వాలంటీర్ కొండా రెడ్డిని నిలదీశారు. అవసరానికి సొమ్మును తానే వాడుకున్నానని.. వచ్చే నెలలో చెల్లిస్తానని చెప్పాడు.
ఇవీ చదవండి: