ETV Bharat / crime

ఈ దొంగ మామూలోడు కాదు.. ఏడాదిలో ఎన్ని చోరీలు చేశాడంటే? - ఆంధ్రప్రదేశ్ న్యూస్

Police arrested a thief: అతను దొంగ.. అలాంటి ఇలాంటి దొంగ కాదు.. 60 కేసుల్లో శిక్ష అనుభవించాడు.. అయినా అతనిలో మార్పు రాలేదు. పైగా ఇంకా దొంగతనం చేయాలనే కోరిక పెరిగింది.. గతేడాది జులై నుంచి ఆగస్టు వరకు అతగాడు చేసిన దొంగతనాలు 27 అంటే అర్థమవుతోంది అతను ఎంత పెద్ద చోర కళాకారుడో.. ఇటీవల ఆ దొంగను విజయనగరం పోలీసులు పట్టుకుని.. 20 తులాల బంగారు ఆభరణాలు, తొమ్మిదిన్నర కిలోల వెండి వస్తువులు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Police arrested a thief
Police arrested a thief
author img

By

Published : Dec 5, 2022, 10:31 PM IST

Vizianagaram theft case: అతడు చెడు వ్యసనాలతో దొంగగా మారాడు. 60 దొంగతనాలకు పాల్పడి, జైలు శిక్ష సైతం అనుభవించాడు. అయినప్పటికీ తన ప్రవర్తనలో మార్పులేదు. ఇళ్ల దోపిడీల్లో నైపుణ్యం సాధించిన ఆ నిందితుడు తిరిగి పలు జిల్లాల్లో 27 దోపిడీలకు పాల్పడ్డాడు. విజనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్​ జిల్లా దొంగ మామిడి తిరుపతిరావు(34) విజయనగరం పోలీసులకు పట్టుబడ్డాడు.

నిందితుడికి సంబంధించిన వివరాలను.. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక జిల్లా వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గంగాడకు చెందిన మామిడి తిరుపతిరావు.. విశాఖపట్నం శ్రీహరిపురం చేపల మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. చెడు వ్యసనాలకు లోనై, డబ్బు కోసం ఇళ్లల్లో దోపిడీ చేయటం వృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తిరుపతిరావు 60కేసుల్లో జైలు శిక్ష సైతం అనుభవించినట్లు ఎస్పీ దీపిక వెల్లడించారు.

జైలు నుంచి బయటకొచ్చినా.., తిరిగి ఇళ్లల్లో దోపిడీ చేయటం ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గతేడాది జులై నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో తిరుపతిరావు 27 దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. తిరుపతిరావుని అరెస్టు చేసి.., అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, తొమ్మిదిన్నర కిలోల వెండి వస్తువులు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దీపిక తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.