wife murdered husband: ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే ప్రేమికుడితో కలిసి భర్తను చంపడానికి పథకం రచించింది. అర్ధరాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అతడిని చంపి.. బాడీనీ దుప్పట్లో పెట్టి జనం సంచరించనటువంటి ప్రదేశంలో పడేసింది. ఎవరికి అనుమానం రాకుండా తన భర్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దాంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మాత్రం విస్తుపోయే అంశాలు బయటికి వచ్చాయి. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం మధురవాడ సమీపంలో జరిగింది.
'మధురవాడ రిక్షా కాలనీకి చెందిన బడుమూరు మురళి.. ఈస్ట్ ఆఫ్రికాలో.. 8 ఏళ్లుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు ఇంటికి తిరిగొచ్చాడు. భర్త విదేశాల్లో ఉన్నప్పుడే.. మృదుల ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనుకుని.. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి.. ఇంట్లోనే చంపేసి.. మృతదేహాన్ని.. బ్రిడ్జి కింద పడేశారు. భార్య ఫిర్యాదుతో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ.. ఆమెపై అనుమానంతో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు.
విశాఖ శివారులోని మధురవాడ సమీపంలో కొమ్మాదిలో బుడుమూరి మురళి కుటుంబం నివాసముంటోది. రిక్షా కాలనీలోని సొంత ఇంటిలో మురళి, భార్య మృదుల, 7 ఏళ్ల కుమారుడు ఉంటున్నారు. మురళి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పిల్లల వలస గ్రామం. వ్యవసాయమే ఆధారంగా వృద్దులైన తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. మురళి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి ఆఫ్రికా ఖండంలో ఇరిట్రియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. 7 ఏళ్లుగా ప్రతి ఏటా 2 నెలల పాటు స్వదేశానికి వచ్చి ఇక్కడ బాగోగులను చూసుకుంటూ వెళ్లి వస్తుండేవారు. ఆ క్రమంలోనే రెండునెలల పాటు సెలవుపై విశాఖ వచ్చి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు.
భర్త విదేశాల్లో పనిచేయడంతో కుమారుడితో ఒంటరిగా ఉంటున్న భార్య... పొరుగునే ఉన్న 18 ఏళ్ల హరి శంకరవర్మతో సాన్నిహిత్యం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఫలితంగా సెలవులకు వచ్చిన భర్తకు తెలియకుండా ఉండాలని మృదుల.. వర్మను దూరంగా పెట్టడం ప్రారంభించింది.. ఇది సహించలేని వర్మ ఎలాగైనా ఆమెను శాశ్వతంగా తనతోనే ఉండాలని.. ఇందుకు మురళిని అడ్డు తొలగించుకోవాలన్నారు. ఫలితంగా రెండువారాల క్రిత్రం ఇంటి నుంచి తన స్వగ్రామానికి బయలుదేరిన మురళి అక్కడకు చేరలేదు. దీంతో తన భర్త ఆచూకీ తెలియడం లేదంటూ ఈ నెల17న భార్య పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇవీ చదవండి: