నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రంలో గల శివారు ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. రెంజల్ మండల కేంద్రంలోని శివారు హనుమాన్ మందిరం పరిసరాల్లో దుండగులు రాత్రి గుప్త నిధుల తవ్వకాలకు యత్నించారు.
గమనించిన గ్రామస్థులు పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు పారిపోగా.. ఒకరిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న ఎస్సై మురళి అదనపు బలగాలను వెంటపెట్టుకుని వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామంలో సీపీ కార్తికేయతో పాటు అదనపు సీపీ అరవింద్ బాబు రెంజల్ చేరుకుని బందోబస్తును పర్యవేక్షించారు.
ఇదీ చదవండి:భార్య, కుమార్తెపై హత్యాయత్నం.. ఆపై పరార్.!