అడుక్కోవడానికి వచ్చి.. పాపను ఎత్తుకెళ్లేందుకు యత్నించిన యువకుడిని చితకబాదిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామయపల్లి గ్రామానికి చెందిన స్వామి... ప్రైవేటు స్కూల్లో కరాటే టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వామి వదిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కాగా... తనని చూడడానికి స్వామి రెండు రోజుల క్రితమే మెదక్ పట్టణానికి వచ్చాడు.
డబ్బులు లేవని అవుసుల పల్లి గ్రామంలో మహిళా వేషధారణ దుస్తులతో యాచిస్తుండగా... అదే గ్రామానికి చెందిన గంగ ఇంటి ముందు బియ్యం అడిగాడు. బియ్యం తీసుకురావడానికి లోపలికి వెళ్లిన గంగను చూసి.. బయట ఆడుకుంటున్న వారి పాప దివ్యను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన గ్రామస్థులు దేహశుద్ధి చేసి.. మున్సిపల్ కార్యాలయంలో బంధించారు. పోలీసులకు సమాచారం అందిచడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చూడండి రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక దందా!