ETV Bharat / crime

'సైకో కిల్లర్​.. బంగారం కోసమే ఆమెను హత్య చేశాడు'

అతనిది సైకో మనస్తత్వం. రూ.500, రూ.1000 కోసం హత్యలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఇప్పటికే ఐదుగురిని హత్య చేసి జైలుకు కూడా వెళ్లాడు. మరోసారి ఓ మహిళను కూలీ పనుల కోసం తీసుకెళ్లి హత్య చేశాడు. వికారాబాద్​ జిల్లాలో ఫిబ్రవరి 25న జరిగిన ఘటనలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు ఇప్పటికే ఐదు హత్యలు చేసినట్లు వెల్లడించాడు.

Vikarabad district police Resolved woman murder case
'సైకో కిల్లర్​.. బంగారం కోసమే ఆమెను హత్య చేశాడు'
author img

By

Published : Mar 4, 2021, 1:31 AM IST

వికారాబాద్ జిల్లా గెరిగేట్​పల్లిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును వికారాబాద్​ జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు ధారూరు మండలం అల్లిపూర్​కు చెందిన మాల కిష్టప్పగా తేల్చారు. అవుసుపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మ కూలీ పనుల కోసం ఫిబ్రవరి 25న వికారాబాద్​లోని కుంది అడ్డ వద్దకు వచ్చింది. ఆమెను గమనించిన కిష్టప్ప... తాను పని కల్పిస్తానని బాధితురాలిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. వెళ్తుండగా దారిలో ఆమెకు కల్లు తాగించాడు.

బంగారం కోసం...

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేట్​పల్లి సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడే హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. అమృతమ్మ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు 27వ తేదీన గెరిగేట్​పల్లి సమీపంలోని నాలాలో శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో భాగంగా... కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు తేలిందని వికారాబాద్​ డీఎస్పీ సంజీవరావు తెలిపారు.

ఇప్పటికే ఐదు హత్యలు...

ఇప్పటికే కిష్టప్ప ఐదు హత్యల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. 1985లో ధారూరు పోలీస్​ స్టేషన్ పరిధిలో రూ. 500ల కోసం మహిళను హత్య చేసి జైలుకు వెళ్లినట్లు చెప్పారు. 2008లో వికారాబాద్, తాండూర్​లలో హత్య కేసులు నమోదు అయినట్లు తెలిపారు. 2010లో యాలాల, 2016లో వికారాబాద్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో హత్యలు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సామాజిక సేవ చేస్తే శిక్ష రద్దు చేస్తాం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.