ETV Bharat / crime

Cheddi Gang: పోలీసుల అదుపులో 'చెడ్డీ గ్యాంగ్'.. నిందితుల నుంచి సొత్తు స్వాధీనం

Cheddi Gang Arrested: ఏపీలోని విజయవాడలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులు గల చెడ్డీ గ్యాంగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

Cheddi Gang: పోలీసుల అదుపులో 'చెడ్డీ గ్యాంగ్'.. నిందితుల నుంచి సొత్తు స్వాధీనం
Cheddi Gang: పోలీసుల అదుపులో 'చెడ్డీ గ్యాంగ్'.. నిందితుల నుంచి సొత్తు స్వాధీనం
author img

By

Published : Dec 17, 2021, 10:24 PM IST

పోలీసుల అదుపులో 'చెడ్డీ గ్యాంగ్'.. నిందితుల నుంచి సొత్తు స్వాధీనం

Cheddi Gang Arrested: ఏపీలోని విజయవాడలో నేరాలకు పాల్పడుతున్న చెడ్డీగ్యాంగ్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని గుల్చర్‌, మధ్యప్రదేశ్‌లోని జుగువాకు చెందిన ముగ్గురిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

గత నెల 8 నుంచి ఈ నెల 6 వరకు విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో, తాడేపల్లి ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయని నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా అన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, నేరాల విధానాలను బట్టి అంతరాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచినట్లు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు రెండు బృందాలుగా మొత్తం పదిమంది విజయవాడ పరిసర ప్రాంతాలకు వచ్చి నేరాలకు పాల్పడిన్నట్లు గుర్తించామన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గుజరాత్​లోని గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీ మేడా, అదే గ్రామానికి చెందిన సక్ర మండోడ్, మధ్యప్రదేశ్​లోని జుగువా తాలుకాకు చెందిన కమలేశ్ బాబేరియాలను అరెస్టు చేసిన్నట్లు సీపీ టాటా పేర్కొన్నారు. మరో ఏడుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు.

శివారు ప్రాంతాలే టార్గెట్..!

శివారు ప్రాంతాల్లో..రహదారికి సమీపంగా ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ పని పూర్తి చేసుకుంటుందని సీపీ చెప్పారు. ప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు పగటిపూట ఆటోలు, బస్సుల్లో ప్రయాణించి రెక్కీ నిర్వహించడం.., రాత్రివేళ చోరీ అనంతరం అక్కడి నుంచి సులువుగా పారిపోయేవారని తెలిపారు. శీతాకాలంలో అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారని.. ఇదే అదనుగా ముఖానికి మంకీ క్యాప్‌ పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Special Teams for Cheddi gang: చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.