Kuwait Triple murder case accused commits suicide
కువైట్‌లో ముగ్గురిని హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న... ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడుకు చెందిన వెంకటేశ్... కువైట్ సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్ చనిపోయిన విషయాన్ని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.
Kuwait Triple murder case:
వెంకటేశ్ మరణ వార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్దియా ప్రాంతంలో ముగ్గురిని హత్య చేసినట్లు వచ్చిన ఆరోపణలతో.. కొద్ది రోజుల క్రితం వెంకటేశ్‌ని కువైట్‌కు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలులో వెంకటేశ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కువైట్ పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు.
ఇదీచూడండి: పోలీసుల దాష్టీకం.. అన్నదాతపై విరిగిన లాఠీ!