ETV Bharat / crime

Boy kidnaped in ggh: కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే.. ఉన్న బిడ్డ మాయం..

The boy was kidnaped in Guntur GGH: ఐదేళ్ల బాలుడు ఏపీలోని గుంటూరు జీజీహెచ్​లో అపహరణకు గురయ్యాడు. కాన్పు కోసం వచ్చిన తల్లి వెంట వచ్చిన ఆ బాలుడు రాత్రి సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

unknown women kidnaped 5 years old boy from ggh
బాలుడు అపహరణ
author img

By

Published : Oct 21, 2022, 4:25 PM IST

The boy was kidnaped in GGH: ఏపీలోని గుంటూరు జీజీహెచ్​లో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురి కావటం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన కిజియా అనే మహిళ కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్​ ఆసుపత్రిలో చేరింది. కిజియాతో పాటు ఆమె ఐదేళ్ల కుమారుడు వర్షిద్ హస్పిటల్​కు వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి వరండాలో నిద్రించాడు.

కాసేపటికి వర్షిద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ మహిళ వర్షిద్​ను తీసుకెళ్లినట్లుగా రికార్డు అయ్యింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా జీజీహెచ్​లో పిల్లల అపహరణకు సంబంధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తరచుగా పిల్లల కిడ్నాప్​లు జరుగుతున్నా ఆసుపత్రిలో నిఘా కొరవడటం ఆందోళన కలిగిస్తోంది.

గుంటూరు జీజీహెచ్​లో బాలుడు అపహరణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.