మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల సరిహద్దు బండారుపల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌లో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే చిన్నచింతకుంట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
సుమారు 35 సంవత్సరాల యువకుడు చేపలు పట్టేందుకు వచ్చి ఈత రాక నీటిలో పడ్డాడా, లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు.
ఇదీ చదవండి: Vaccination: రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు టీకాలు