హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. జబ్బార్ అనే వ్యక్తి.. హుస్సేన్ సాగర్లో మృతదేహాన్ని చూసి.. డయల్ 100కు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాజు.. పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని సాగర్ నుంచి బయటకు తీసి.. గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి వయసు 40 ఏళ్లు ఉంటాయని.. ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటాడని.. శరీరంపై తెలుపు రంగు ప్యాంట్, పసుపు రంగు షర్ట్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతడి సంబంధిత వ్యక్తులు ఎవరైన ఉంటే.. రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో లేదా 040-27853595 , 9951583904 , 9490616346 ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి: పెరుగుతున్న కేసులు.. సమాయత్తమవుతున్న అధికారులు