మహబూబ్‌నగర్ జిల్లాలో గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని రైల్వే స్టేషన్కు సమీపంలో బోయపల్లి గేటు వద్ద మహిళ(40) ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు గూడ్స్ రైలు వెళ్తుండగా... ఆ సమయంలో పట్టాలపైకి ఆకస్మాత్తుగా మహిళ వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు లోకో పైలెట్ నిర్ధారించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో బాధితులకు ప్రలోభాలు'