జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. దానిలో మిర్చి పంట వేశాడు. రేయనక, పగలనక కష్టపడ్డాడు. పంట చేతికి వచ్చిందని సంబురపడ్డాడు. పంటను కోసి కళ్లం తయారు చేసుకుని ఆరబెట్టాడు.
ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉందని... పంటను విడిచి పెట్టి ఇంటికి పోయాడు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మిర్చి కుప్పకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో సుమారు 70 క్వింటాళ్ల మిర్చి పంట దగ్ధమైంది. దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంటను కోల్పోయినందుకు రైతు కుటుంబం బోరున విలపించడం స్థానికుల మనసును కలచి వేసింది. సకాలంలో ఫైరింజన్ వచ్చినా... మంటలను అదుపు చేయలేక పోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: కెనడాలో నల్గొండ జిల్లా విద్యార్థి ఆత్మహత్య