సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం పీఎస్ పరిధిలోని అశోక్‌నగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుని వయసు దాదాపు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతను నిద్రలోనే మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.