ETV Bharat / crime

child died: నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి - telangana varthalu

child died: నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

author img

By

Published : Sep 11, 2021, 2:42 PM IST

Updated : Sep 11, 2021, 3:09 PM IST

14:40 September 11

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

అప్పటివరకు కళ్లముందే బుడి బుడి అడుగులతో తిరిగిన చిన్నారి అడుగులు ఆగిపోయాయి. చిలిపి చేష్టలతో తల్లిదండ్రుల కష్టాలను మరచిపోయేలా చేసే ఆ అల్లరి మూగబోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలుసుకున్న అమ్మనాన్నలు శోకసంద్రంలో మునిగిపోయారు. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పరిధిలోని సుధీర్​కుమార్​ కాలనీలో జరిగింది.

ఆడుకుంటూ వెళ్లి చిన్నారి నిత్య(2) నీటి సంపులో పడిపోయింది. నీటి సంపులో పడిన గంట తర్వాత తమ కూతురి కోసం తల్లిదండ్రులు వెతకగా... నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. తమ కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కలచివేసింది. 

ఇదీ చదవండి: యువకుడి వేధింపులు తాళలేక... 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Sep 11, 2021, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.