సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన శరత్కుమమార్ స్థానికంగా మెకానిక్ పని చేస్తుండేవాడు. ఈనెల 30న అతను పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి భార్య భవాని కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య అదృశ్యంపై నారాయణ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో ఘటనలో.. పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ స్థానికంగా వడ్రంగి పనులు చేస్తుంటాడు. ఈనెల 29న పనికి వెళ్లిన అతను.. తన భార్య కనిపించడం లేదని పిల్లలు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చాడు. చుట్టుపక్కల వెతికినా ఆమె దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అదృశ్యంపై రవితేజ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు మహిళల కోసం గాలిస్తున్నారు.
- ఇదీ చదవండి: Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి