జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం చెల్పూరు శివారులో ప్రమాదం జరిగింది. సింగరేణి వెయ్యి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు తండాకు చెందిన భూక్య రాజేందర్(27), జాటోతు రాంచరణ్ (20)ఇసుక కోసం సమీప అడవులకు ట్రాక్టర్లో వెళ్లారు. ఇసుకను తీసుకొచ్చి వెయ్యి క్వార్టర్స్ సమీపంలో దింపి భూపాలపల్లివైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: GHMC: హైదరాబాద్ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!