వనపర్తి పట్టణ శివారు నాగవరం రైతు వేదిక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది(road accident at wanaparthy). ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా... ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు(Two were killed when an RTC bus collided with them).
వనపర్తి మండలం రాజుపేటకు చెందిన అశోక్, ప్రకాశ్... ద్విచక్రవాహనంపై వనపర్తికి వెళ్తున్నారు. నాగవరం రైతువేదిక సమీపంలో ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు(RTC bus collided two wheelar). ఘటనలో తీవ్రంగా గాయపడిన అశోక్, ప్రకాశ్ ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: student died: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువతి దుర్మరణం