సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మెుదలవడంతో సజ్జన్‌పల్లికి చెందిన ఆంజనేయులు హిమాయత్‌నగర్‌లో పరీక్ష రాశాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కలిసిన పవన్, విట్టల్ అనే తోటి స్నేహితులను... వెంకటాపూర్‌లోని ఈసీ వాగు కత్వ వద్ద ఈత కొడదామని బైక్ ఎక్కించుకున్నాడు. ముగ్గురు కలసి వాగులోకి దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో పవన్, విట్టల్ ఇద్దరు నీటమునిగారు. అది గమనించిన ఆంజనేయులు రక్షించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారిని రక్షించమని అడగగా సమయానికి ఎవరూ లేకపోవడంతో పవన్, విట్టల్ గల్లంతయినట్లు ఆంజనేయులు పేర్కొన్నాడు.
సోమవారం సాయంత్రం చీకటిపడటంతో గల్లంతైన ఇద్దరి యువకులను వాగులో గుర్తించలేకపోయారు. ఇవాళ ఉదయం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: Suicide attempt: డీఎస్పీ కార్యాలయం ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం