ఏపీలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. తలకోన సెంట్రల్ బీట్‌లోని ఎలమ చెట్లదడి వద్ద వారిని గుర్తించిన ఎర్రచందనం స్మగ్లర్లు.. దుంగలు పడవేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. పరిసర ప్రాంతాల్లో గాలింపులు చేపట్టిన అధికారులు ఇద్దరు స్థానిక స్మగ్లర్ల అరెస్ట్ చేశారు.
వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పట్టుబడ్డ వారిని సోమల మండలానికి చెందిన చిన్న మల్లయ్య, యర్రావారిపాళ్యం మండలానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు.
- ఇదీ చదవండి : ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు