ETV Bharat / crime

Gandhi Hospital in Secunderabad : 'సర్కారు దవాఖానాల్లో ఇట్లనే ఉంటదట' - గాంధీ ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం

చికిత్సకయ్యే ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న పేదవాళ్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటే.. అక్కడి సిబ్బంది మాత్రం వారి ప్రాణాలకు విలువనివ్వడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రశ్నిస్తే సర్కార్ దవాఖానాల్లో ఇలాగే ఉంటుందంటూ సమాధానమిస్తున్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో(Gandhi Hospital in Secunderabad) రోగుల పట్ల నర్సుల వైఖరి.. ప్రభుత్వ ఆసుపత్రుల తీరుని బయటపెడుతోంది.

Gandhi Hospital in Secunderabad
Gandhi Hospital in Secunderabad
author img

By

Published : Nov 1, 2021, 12:03 PM IST

గాంధీ ఆస్పత్రిలో నర్సుల నిర్లక్ష్య వైఖరి

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital in Secunderabad)లో రోగుల పట్ల నర్సుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది. ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో ఒకే బెడ్‌పై ఇద్దరు గర్భిణీ స్త్రీలను పడుకోబెట్టి చికిత్స అందించడం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

బోయిన్‌పల్లికి చెందిన అను అనే మహిళ గత మూడు రోజుల క్రితం పురిటి నొప్పులతో గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital in Secunderabad)లో చేరింది. అదేరోజు ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు మధ్యాహ్న సమయంలో మరో స్త్రీ పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. బెడ్ లేకపోవడంతో అనూ చికిత్స పొందుతున్న బెడ్‌పైన పడుకోబెట్టారు. ఒకే బెడ్‌పై పురిటి నొప్పులతో ఉన్న మహిళను.. ప్రసవించిన మహిళను.. పడుకోబెట్టడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.

గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital in Secunderabad) సిబ్బంది తామేమీ చేయలేమని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న అనూను డిశ్చార్జ్ చేయమని వైద్యులను అడగగా ఆదివారం కాబట్టి డిశ్చార్జి చేయలేమని చెప్పినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.