ETV Bharat / crime

Godavari River: గోదావరిలో ఇద్దరు గల్లంతు.. నలుగురు సురక్షితం - నిజామాబాద్ జిల్లా నేర వార్తలు

గోదావరిలో(Godavari River) ఈతకు వెళ్లగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ వద్ద జరిగింది.

two persons washed away in godavari
గోదావరిలో ఇద్దరు గల్లంతు
author img

By

Published : Oct 3, 2021, 8:24 PM IST

ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆదివారం కావడంతో గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు గోదావరి(Godavari River) ప్రవాహంలో కేతారం దేవసి(28), హీరారం(30) అనే ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఆలయం పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది.

నందిపేట్ మండల కేంద్రంలో కిరాణం, ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్న రాజస్థాన్​కు చెందిన ఆరుగురు ఆదివారం కావడంతో మధ్యాహ్నం గోదావరి అందాలను తిలకించేందుకు వెళ్లారు. ఉమ్మేడ ఉమామహేశ్వర ఆలయం వద్ద ఉన్న వంతెన వద్ద గోదావరిలో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయారు. మిగిలిన వారు కేకలు వేయడంతో అటువైపు వెళ్తున్న యువకులు నదిలోకి దిగి ఒకరిని కాపాడారు. అప్పటికే మిగతా ఇద్దరు కనిపించకుండా పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై శోభన్ బాబు తెలిపారు.

ఇదీ చూడండి: Dead Body in Musi river: మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.