ఆంధ్రప్రదేశ్లోని కడప శివారు రామాంజనేయపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. వడ్రంగి పనిచేసే మస్తాన్, శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై సిద్ధవటం వైపు వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టారు.
మద్యం సేవించి వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలమంతా తీవ్ర రక్తస్రావమైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అటవీప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు