ETV Bharat / crime

టిఫిన్ చేసేందుకని వెళ్తే మృత్యువు కబళించింది - ఇద్దరు మృతి

టిఫిన్​ చేసేందుకు వెళ్తే మృత్యువు వారిని వెంబడించింది. తెల్లవారుజామున ఆకలి తీరకముందే వారి బతుకులు తెల్లారాయి. రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ శివారులోని దాబా హోటల్​ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

two persons died in road accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
author img

By

Published : Jun 6, 2021, 6:22 PM IST

తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు దాబాకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన ముగ్గురు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శివారులో వేకువజామున రెండు గంటలకు చోటుచేసుకుంది.

ఆర్మూర్​లోని రాంనగర్​కు చెందిన సూర్యకిరణ్, అతని స్నేహితులు వంశీ, పవన్ కలిసి ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అనంతరం ఆర్మూర్​లోని పెర్కిట్ శివారులో ఉన్న దాబా హోటల్​కు టిఫిన్ చేయడానికి అర్ధరాత్రి దాటిన తర్వాత బయలు దేరారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. డ్రైవరు అతివేగం, అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలంలోనే సూర్యకిరణ్​ మృత్యువాత పడ్డారు. వంశీని నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవన్​ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు సూర్య కిరణ్ మేనమామ సదానంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో సైదేశ్వర్ తెలిపారు. కుమారులు మృతి చెందడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి: వ్యక్తి గొంతుకోసిన దుండగులు.. రక్తస్రావంతోనే 100మీటర్లు పరుగెత్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.