మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా... జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మృతులు మహారాష్ట్ర వాసులు:
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్కు చెందిన మనోజ్, కాజల్, పాయల్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సిరోంచలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ భార్య వద్దకి తన అన్నయ్య కూతుళ్లను వెంట తీసుకొని వెళ్తుండగా ముల్కల వద్ద ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో మనోజ్, కాజల్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన పాయల్‌ను మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.