ETV Bharat / crime

Road accident at rajaram: రెండు బైకులు ఢీ.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం - రెండు బైకులు ఢీ

Road accident at rajaram: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృత్యువాత పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Road accident rajaram
ఇద్దరు దుర్మరణం
author img

By

Published : Apr 24, 2022, 10:34 PM IST

Road accident at rajaram: జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మల్యాల మండలం రాజారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన వేముల కనకదాసు, ఆయన భార్య లావణ్య జగిత్యాలకు వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కనకదాసుతో పాటు మరో బైక్​పై ఉన్న యాసిన్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ లావణ్య, మరో వ్యక్తి మహేశ్​ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.