ETV Bharat / crime

వీడియో: హెడ్​మసాజ్​ చేయలేదని సెలూన్​ యజమానిని చితకబాదిన యువకులు - saloon shop lo godava

ప్రస్తుత రోజుల్లో కొందరు యువకులు కారణం లేకుండానే గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న, చిన్న విషయాలకే ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హనుమకొండలో చోటుచేసుకుంది.

Attack on owner for not doing head massage
హెడ్​మసాజ్​ చేయలేదని యాజమానిపై దాడి
author img

By

Published : Dec 31, 2022, 5:32 PM IST

Updated : Dec 31, 2022, 5:48 PM IST

హెడ్​మసాజ్​ చేయలేదని యాజమానిపై దాడి

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు ఓ సెలూన్ యజమానిని చితకబాదారు. దాడి ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. వివరాల్లోకి వెళితే.. నైమ్​నగర్​లోని రేయలెన్స్ సెలూన్​కు శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇద్దరు వ్యక్తులు వచ్చి హెడ్ మసాజ్ చేయాలని అడగగా.. సమయం లేదని సెలూన్ యజమాని రంజిత్ చెప్పాడు. దీంతో యువకులు గొడవకు దిగారు. యజమాని రాజేశ్​పై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈరోజు హనుమకొండ పోలీస్​స్టేషన్​లో యజమాని రాజేశ్​ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2022, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.