Balaji nagar theft case : సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం చేశారు ఓ ఇద్దరు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి బంగారం, నగదు కాజేశారు. అంతే రెండు గంటల్లోనే పోలీసులకు చిక్కారు.
ఏం జరిగింది?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ బాలాజీనగర్లో విజయలక్ష్మి వస్త్ర దుకాణం యాజమాని లింగం నివసిస్తున్నారు. వారి ఇంటికి బంధువులు వచ్చారు. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు, బంధువులు సినిమా చూడటం కోసం నారపల్లికి వెళ్లారు. సినిమా అయ్యాక ఇంటికి వచ్చేసరికి... అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరిని చూసి పారిపోయారు. తీరా ఇంట్లోకి వెళ్లి చూస్తే.. తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 28 తులాల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని... స్థానిక పరిసరాలను పరిశీలించి... సీసీ కెమెరాలను డేటాను సేకరించారు.
ఇలా దొరికారు..
ఇంటి సమీపంలో ఉండే మహమ్మద్ నవీద్, వెంకటరమణలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం రెండు గంటల్లోనే గుర్తించి... ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసు స్టేషన్కు తరలించి విచారణ జరిపారు. దొంగతనం చేసినట్టు వాళ్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు దినసరి కూలీలుగా పని చేస్తున్నారని... వారికి వచ్చే సంపాదన సరిపోకపోవడంతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: Godavarikhani Accident Today: బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి