ETV Bharat / crime

Drugs Seized: హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్ లో డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అరెస్ట్

Drugs Seized: హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఇంటిపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయితో పాటు ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

TWO PEOPLE ARRESTED IN DRUGS
మాదకద్రవ్యాలు స్వాధీనం ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Feb 18, 2022, 11:43 AM IST

Drugs Seized: హైదరాబాద్ మెహదీపట్నంలోని మాదకద్రవ్యాలు కలిగిఉన్న ఇద్దరిని ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా రిలయన్స్‌ కోహినూర్‌ అపార్ట్‌మెంట్‌లోని షోయబ్ ఖాన్ ఇంటిపై దాడులు చేసి మత్తు పదార్థాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మెహదీపట్నంలో నివాసముంటున్న ముబాసిర్‌ అహ్మద్‌ను ఎక్సైజ్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. అతని అనుచరుడు అర్బాజ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. షోయబ్ చెప్పినందుకే తాము డార్క్‌ వెబ్‌ సైట్‌ల ద్వారా మత్తు పదార్థాలు తెప్పించినట్టు నిందితులు ఎక్సైజ్‌ పోలీసులకు తెలిపారు.

పరారీలో ఉన్న షోయబ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి మూడు చరవాణులు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: foreign currency seized in Shamshabad : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ, బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.